హైదరాబాద్: 28°C
వార్తలు

ఆక్వా రైతులను జగన్ దోపిడి చేశారు: మంతెన

AP: జగన్ హయాంలో ఆక్వా రైతులును దోపిడీ చేశారని టీడీపీ నేత మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. అప్పుడు దోపిడి చేసిన ఇప్పుడు ఆక్వా రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల పేరుతో నాడు జగన్ రైతులను వేధించారని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే జగన్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు.