AP: తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాకు ఇవాళ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ సిరి తెలిపారు. రోజుకు 900 క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర నుంచి 1.5 TMCల నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తామని వెల్లడించారు. ఈ నీరు జిల్లాకు రావడానికి వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.
వార్తలు
నేడు తుంగభద్ర నుంచి నీటి విడుదల


