హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేష్

AP: కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి ZP ఉన్నత పాఠశాలను మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను మంత్రి పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. క్లాసులు ఎలా జరుగుతున్నాయి, విద్యాబోధన ఎలా ఉందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్కూలు సాధిస్తున్న ఫలితాలపై టీచర్ల వద్ద ఆరా తీశారు.