హైదరాబాద్: 28°C
వార్తలు

18న చెక్కు కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్

CTR: చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చెక్కు కేసులను పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించి, కక్షిదారులకు ఉపశమనం కల్పించడమే ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యమని తెలిపారు.