హైదరాబాద్: 28°C
వార్తలు

'పాత బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి'

JGL: గ్రామపంచాయతీలపై పేరుకుపోయిన పాత విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కోరుతూ మెట్పల్లి మండల సర్పంచులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చిన్న గ్రామపంచాయతీలకు సుమారు రూ.10 లక్షల నుంచి పెద్ద గ్రామపంచాయతీలకు రూ.50 లక్షల వరకు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బకాయిల భారం నుంచి గ్రామపంచాయతీలను ఆదుకోవాలని వారు కోరారు.