హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువు కట్టపై వరుణ పూజలు.!

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బుధవారం సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ మహిళలు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు కట్టపై ఉయ్యాల ఊగుతూ, కోలాటాలు ఆడుతూ సంప్రదాయబద్ధంగా ప్రార్థనలు చేశారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.