హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాలో మెరిసిన జగిత్యాల విద్యార్థిని

JGL: జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చెల్ల నాగమణి జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటింది. ఒడిశాలోని కేఐఐటీ, భువనేశ్వర్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థినితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి రాము అభినందించారు.