హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభం

NRML: నిర్మల్ జిల్లా తానూర్ మండలం జవ్లా-బి, కోలూర్ గ్రామాల్లో నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం ప్రారంభించారు. జవ్లా-బిలో ఆయుష్మాన్ భారత్ ఉపకేంద్రం, పాఠశాల ప్రహరీని కూడా ప్రారంభించారు. గ్రామాలకే వైద్య సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, 27 ప్యాకేజ్ పనులతో తానూర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.