హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు వారాలు చికెన్, మటన్ బంద్

ఆషాఢీ వారీ పురస్కరించుకుని పండరీపూర్ విఠోబా దర్శనానికి వచ్చే లక్షలాది మంది వార్కరీల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి 29 వరకు పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ.. సోలాపూర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.