హైదరాబాద్: 28°C
వార్తలు

8 ఏళ్లుగా అసంపూర్తిగా మత్స్య కళాశాల భవన నిర్మాణం

WNP: పెబ్బేరులో మత్స్య కళాశాల భవన నిర్మాణ పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2018లో నిధులు మంజూరైనా, ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం 100 మంది విద్యార్థులు వసతి గృహంలోనే తరగతులు వినాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేసి కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.