హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రజక సంఘం బేడా నంబర్–2కు చెందిన 100 మందికి పైగా సభ్యులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజక సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.