హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలానికి చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.