హైదరాబాద్: 28°C
వార్తలు

'గర్భధారణల మధ్య విరామం పాటించాలి'

PLD: తల్లి, బిడ్డల ఆరోగ్యానికి గర్భధారణల మధ్య సరైన విరామం ఎంతో అవసరమని క్రోసూరులో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా వారోత్సవాల్లో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని ఆయన సూచించారు. దీనివల్ల ప్రసవ సమస్యలు తగ్గి, తల్లికి, శిశువుకు మెరుగైన ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు.