హైదరాబాద్: 28°C
వార్తలు

'పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించి వేగంగా పూర్తి చేయాలని జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదర్శనగర్ మెయిన్‌రోడ్, నల్లకుంట, అంకిరెడ్డిపాలెం చెరువు వాకింగ్ ట్రాక్, శ్మశానవాటిక ప్రాంతాల్లో పెండింగ్ పనులు, పారిశుధ్యాన్ని పరిశీలించారు.