హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కండక్టర్ టికెట్ బ్యాగ్ చోరీ

RTC బస్సులో కండక్టర్ టికెట్ బ్యాగ్ చోరీకి గురైన ఘటన తమిళనాడులో జరిగింది. టికెట్ బ్యాగ్ దొరకకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని కండక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను పోలీసులు తనిఖీ చేయగా.. టికెట్ బ్యాగ్ లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.