హైదరాబాద్: 28°C
వార్తలు

భూ రీ-సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

BHPL: ఘన్‌పూర్ మండలంలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆధునిక రోవర్ సాంకేతికతతో భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల హక్కులు పరిరక్షితమవుతాయని కలెక్టర్ తెలిపారు.