PLD: రొంపిచర్ల (మం) సుబ్బయ్యపాలెంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, తొట్టెల్లో నీరు నిల్వ ఉండనివ్వొద్దని సూచించారు. దోమతెరలు వినియోగించడంతో పాటు పూర్తి శరీరాన్ని కప్పే దుస్తులు ధరించాలన్నారు.
వార్తలు
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ


