హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

BDK: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలను ఉల్లంఘించిన 36 వాహనాలపై కేసులు నమోదు చేశారు.