హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీలంకలో అవనిగడ్డ ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం

కృష్ణా: శ్రీలంక పర్యటనకు వెళ్లిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు కొలంబో విమానాశ్రయంలో స్వాగతం లభించింది. బుధవారం బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు, డి.విజయభాస్కర్, అనురాధ విమానాశ్రయం చేరుకున్నారు. వారికి శ్రీలంక తెలుగు కాంగ్రేస్ అధ్యక్షులు అన్బూజగన్ స్వాగతం పలికారు.