హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై చిన్న గొడవ.. కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య

SRD: జిల్లాలోని కంది గ్రామంలో రోడ్డుపై నిలబడిన విషయంపై జరిగిన స్వల్ప వాగ్వాదం హత్యకు దారితీసింది. కారులో వెళ్తున్న కాశీపురం ఆంజనేయులు, చక్రితో గొడవపడగా అతడి తండ్రి బూడిద రమేష్ జోక్యం చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కారుతో రమేష్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.