హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్సవాలకు ఉప సర్పంచ్ సాయం

MDK: చేగుంట శ్రీ ఉజ్జయిని మహంకాళి గ్రామ దేవత అమ్మవారు ఉత్సవాలు వచ్చే నెల 8 నుంచి నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆషాడ బోనాల ఉత్సవాలలో 8న కలశాల ఊరేగింపు, 9న బోనాల ఊరేగింపు, 10న మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఆషాడ బోనాలకు ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ. 1.51 లక్షల సహాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.