హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ సంఘాలు వినతి.. స్పందించిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ MLA నిమ్మక జయకృష్ణను బుధవారం RTC ఉద్యోగ సంఘాలు మర్యాదపూర్వకంగా  కలిసాయి. నూతన ఎలక్ట్రిక్‌ బస్సులను పైవేట్‌ సంస్థలకు అప్పగించకుండా RTC ద్వారానే నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పైవేటీకరణతో ఉద్యోగ భద్రత, ఉపాధి, ప్రజారవాణా సేవలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన ఆయన CM,DCM దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.