హైదరాబాద్: 28°C
వార్తలు

'మస్తాన్ వలి దర్గాలో శానిటేషన్ పనుల పరిశీలన'

ATP: పాత గుంతకల్లు వెలిసిన హజరత్ మస్తాన్ వలి దర్గాలో బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు. దర్గా ముజాపర్లు ఆమెకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం దర్గా ఆవరణలో చేస్తున్న శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా చెత్త బండికి ఇవ్వాలని ప్రజలకు సూచించారు.