హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ రహదారి ప్రక్కన ఒక వ్యక్తి మృతి....!

NLR: కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రోడ్డు పక్కనే ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కిసాన్ సేజ్ సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే హైవే అథారిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉన్నది.