SKLM: ఆమదాలవలస ZP పాఠశాల ఆవరణలో బుధవారం శక్తి టీమ్ -2 టి. అమ్మాజీ ఆధ్వర్యంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ డౌన్‌లోడ్ విధానం, బాల్య వివాహాల నిరోధం పై అవగాహన కల్పించారు. అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు 112, 181, 1091, 1096, 1098 గురించి వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వార్తలు
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి


