హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 17న జాబ్ మేళా

NRML: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం జాబ్ మేళ నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా, విద్యా ధ్రువపత్రాలు, ఆధార్, పాన్ కార్డు ప్రతులతో హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి జి. విజయలక్ష్మి తెలిపారు.