AKP: నర్సీపట్నం పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం దుర్గాబాయి దేశముఖ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి మాట్లాడుతూ దుర్గాబాయి దేశముఖ్ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పారన్నారు. రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు ఏర్పాటు చేశారన్నారు.
వార్తలు
జడ్పీ హైస్కూల్‌లో దుర్గాబాయి దేశముఖ్ జయంతి


