హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంజీఎం పోలీస్ జెట్ పోస్టులో సిబ్బంది కొరత

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పోలీస్ జెట్ పోస్టులో సిబ్బంది కొరత విధుల నిర్వహణకు ఆటంకంగా మారింది. అనాథ మృతదేహాల పోస్టుమార్టం, మెడికోలీగల్ కేసులు, భద్రతా బాధ్యతలు సహా పోలీసు సంబంధిత సేవలను ప్రస్తుతం పరిమిత సిబ్బందితో నిర్వహిస్తున్నారు. 24 గంటలపాటు సేవలు అందించే ఈ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.