WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇవాళ శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. HNK ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
వార్తలు
నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించిన.. MLA


