భవిష్యత్తుకు అనువుగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించాలని భారత్ పునరుద్ఘాటించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. ప్రపంచ సంక్షోభాల నుంచి ప్రజలను కాపాడటంలో భద్రతామండలి విఫలమైందన్నారు. సంఘర్షణలపై సమర్థవంతంగా స్పందించకపోవడం వల్లే దానిపై ప్రజల విశ్వాసం దెబ్బతిందని, అసమర్థతే దీనికి మూలకారణమని ఆయన విమర్శించారు.
వార్తలు
'భద్రతామండలిలో సంస్కరణలు అవసరం'


