హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ పీడీఎస్ బియ్యం స్వాధీనం

ASR: గుంటసీమ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 1,500 కిలోల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.బంగారుబండి నరేష్ అనే వ్యక్తి బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు గుర్తించి, అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసిల్దార్ ఓ.ప్రశాంత్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గుంటసీమ రేషన్ దుకాణంలో భద్రపరిచారు.