ATP: నగరంలోని పైవంతెన సమీపంలోని వెంకటరెడ్డి కాలనీలో వెలసిన వీరాంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్వామి మూల మూర్తిని కూష్మాండాలతో అభిషేకించారు. అనంతరం స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రధాన అర్చకుడు శ్రీహర్ష, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరాంజనేయులు, సభ్యులు పూజలను పర్యవేక్షించారు.
వార్తలు
వీనాంజనేయుడికి కూష్మాండ పూజలు


