హైదరాబాద్: 28°C
వార్తలు

తిమ్మాపూర్ లో ఒకరి ఇంట్లో చోరీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో సత్తయ్య అనే వ్యక్తి తాళం వేసి ఊరికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తాళం బద్ధలు కొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి ఇంటిలోని వస్తువులను చిందరవందరగా పడేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నమూనాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.