హైదరాబాద్: 28°C
వార్తలు

'152 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం'

NZB: బాబన్ సాబ్ పహాడ్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం నిర్వహించిన దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారని సీఐ వెంకటేశ్ తెలిపారు. ఈ ఘటనలో సయ్యద్ చావూస్‌ను అరెస్టు చేసి, నిందితుడు ఉపయోగిస్తున్న బైక్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని NZB SHOకు అప్పగించారు.