హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పర్వతగిరిలో క్షుద్రపూజల కలకలం.. దర్యాప్తు ప్రారంభం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయం గుట్ట సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించినట్లు అనుమానిస్తున్న ఘటన కలకలం రేపింది. బుధవారం స్థానికులు అక్కడ నిమ్మకాయలు, వెలిగించిన దీపాలు, మట్టి బొమ్మలు, కోడి, మేక బలుల అవశేషాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.