హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన

HNK: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోగు ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ–ములుకనూర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.