ADB: భీంపూర్ మండలం అర్లి-టి గ్రామానికి చెందిన యశోదకు మంగళవారం ప్రసవ వేదనలు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, నవజాత శిశువును సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
అంబులెన్స్‌లో గర్భిణికి సురక్షిత ప్రసవం


