హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరు అభివృద్ధిని ఆపలేరు: మంత్రి నారాయణ

నెల్లూరు నెక్లెస్ రోడ్డుకు రూ. 50 కోట్లు, పినాకిని పార్కుకు రూ. 50 కోట్ల నిధులను సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేయించానని మంత్రి నారాయణ తెలిపారు. వీఆర్సీ స్కూల్, వృక్షాల పెంపకంపై విపక్షాలు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నగర ప్రగతిని అడ్డుకోవాలని చూస్తే అది వైకాపాకే నష్టమని ఆయన హితవు పలికారు.