హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయాలి'

KMM: కూసుమంచి మండలంలో జరుగుతున్న ఓటరు సర్వేను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఫారాల నమోదులో ప్రత్యేక సహాయం అందించి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో కుటుంబ సభ్యులందరి వివరాలు సేకరించాలని ఆదేశించారు.