హైదరాబాద్: 28°C
వార్తలు

'అంగన్వాడీ పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలి'

MLG: అంగన్వాడీ ఆయా, టీచర్ పోస్టుల భర్తీలో పెసా గ్రామసభ తీర్మానాన్ని అమలు చేయాలని కోరుతూ వాజేడు మండలం చింతూరు గ్రామానికి చెందిన ఆదివాసీలు అదనపు కలెక్టర్ మహేందర్ జీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం మేరకు ఆయా పోస్టులను స్థానిక ఎస్టీ మహిళలకే కేటాయించాలని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.