హైదరాబాద్: 28°C
వార్తలు

ముద్రగడ మృతికి ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ సంతాపం

పల్నాడు: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, జీ.వీ ఆంజనేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో విశిష్ట సేవలందించిన ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని కొనియాడారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యంగా ఉండాలన్నారు.