హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లే లక్ష్యం: కలెక్టర్

MDK: జిల్లాలో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు అందించడమే లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంజూరైన 9,000 ఇళ్లలో 83% పురోగతితో, 1,700 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మొదటి విడత లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, రెండో విడతలో గుడిసెల్లో ఉండేవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.