హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూళ్లలో కంటి పరీక్షలు.. ఉచితంగా కళ్లద్దాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోని 43.30 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ్టి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని చెప్పారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 6 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్లు వివరించారు.