హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శిశువుల రక్షణ కోసం 'ఉయల' కేంద్రం ప్రారంభం

నారాయణపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన 'ఉయల' కేంద్రాన్ని నేడు కలెక్టర్ ప్రియాంక ప్రారంభించనున్నారు. అనివార్య కారణాలతో శిశువులను పెంచుకోలేని వారు, వారిని సురక్షితంగా ఈ కేంద్రంలో అప్పగించాలని అధికారులు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిశువులకు రక్షణ కల్పిస్తూ చట్టబద్ధంగా దత్తత ప్రక్రియను చేపడతారు.