ప్రకాశం: మార్కాపురం జిల్లా పామూరు మండలం మోపాడు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఐచర్ లారీ వాహనం ఢీకొట్టి వెళ్లినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. మృతుడు వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


