హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు భీమవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన

AP: రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారికి అండగా నిలిచేందుకు ఈ పర్యటన చేపట్టారు. రైతుల కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ పర్యటన ద్వారా వారి సమస్యలను తెలుసుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని జగన్ తెలిపారు.