హైదరాబాద్: 28°C
వార్తలు

యాసిడ్ దాడి బాధితులకు కేంద్రం గుడ్‌న్యూస్

దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు బాహ్య గాయాలు కనిపించే బాధితులకు మాత్రమే ప్రధానంగా దివ్యాంగుల హక్కుల చట్టం-2016 కింద ప్రయోజనాలు అందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇకపై బాహ్య గాయాలు లేకపోయినా అంతర్గత అవయవాలు దెబ్బతిన్న యాసిడ్ దాడి బాధితులకు కూడా అదే చట్టంలోని అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.