ASR: చింతపల్లి మండలం కొలపరి గ్రామాన్ని మంగళవారం సీఐ సింహాచలం, ఎస్సై జీ.వీరబాబు సందర్శించారు. ఈ మేరకు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రహదారి భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
వార్తలు
'బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'


