హైదరాబాద్: 28°C
వార్తలు

పరీక్షలపై CBSE కీలక నిర్ణయం

బోర్డు పరీక్షలపై CBSE కీలక నిర్ణయం తీసుకుంది. మూడో భాషపై స్పష్టమైన విధివిధానాలు జారీ చేసింది. ఇకపై 9, 10 తరగతులకు మూడో భాష పరీక్షకు ఇంటర్నల్ అసెస్‌మెంటే ఉంటుందని స్పష్టం చేసింది. 2026-27లో 9వ తరగతిలో చేరే విద్యార్థులు 3 భాషలు చదవాలని పేర్కొంది. మూడు భాషల్లో 2 భారతీయ భాషలు ఉండాలని నిబంధన విధించింది. మూడో భాష.. విదేశీ లేదా నాన్ నేటివ్ భాష ఎంచుకునేందుకు వీలు కల్పించింది.