హైదరాబాద్: 28°C
వార్తలు

బోరబండ బస్తీ దవాఖానలో మంత్రి పర్యటన

HYD: హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ బోరబండ బస్తీ దవాఖానను స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో కలిసి సందర్శించారు. వైద్య సేవలను పరిశీలించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.